శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం

రూ.3.30 కోట్ల నిధుల స్వాహా

Srisailam temple

Srisailam: శ్రీశైలం దేవస్థానం లో భారీ కుంభకోణం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు రూ.  3.30కోట్ల మేర నిధులు స్వాహా చేశారు.

శ్రీఘ్రదర్శనం, అభిషేకం, మంగళహారతి టికెట్ల వ్యవహారంలో ఈ గోల్ మాల్ జరిగిందని శ్రీశైలం దేవస్థానం ఈవో తెలిపారు. దేవ స్థానం గదుల బుకింగ్ లో కూడా కాంట్రాక్ట్ కార్మికులు అక్రమాలకు పాల్పడ్డారని, సాఫ్ట్ వేర్ మార్చి అక్రమాలకు పాల్పడ్డారని తెలిసింది.

అవినీతి బయటపడటంతో ఈవోకి పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో కుంభకోణం వెలుగులోనికి వచ్చింది. అక్రమాలు జరిగిన మాట వాస్తవమేననీ, ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఈవో తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/