విజయవాడలో హై సెక్యూరిటీ

vijayawada
vijayawada

అమరావతి: నవ్యాంధ్రకు రెండో సియంగా వైఎస్‌ జగన్‌ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మధ్యాహ్నం 12.23 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ ఏపి సియంగా జగన్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా విజయవాడను పోలీసులు హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించారు. 5 వేల మంది పోలీస్‌ సిబ్బందితో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు 13 ఎకరాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయవాడలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆంక్షలు ఈ సాయంత్రం వరకు కొనసాగనున్నాయి.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/