కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు

GOPALKRISHNA DWIVEDI
GOPALKRISHNA DWIVEDI

అమరావతి: ఏపికి ఓట్ల లెక్కింపునకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పోలీసు పరీశీలకుడు కెకె శర్మ ఈరోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో సమావేశమయ్యారు. ఇద్దరు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు. అయితే కౌటింగ్ బందోబస్తు కోసం రాష్ట్రానికి 90 కంపెనీల పారామిలటరీ బలగాలు నియోగిస్తున్నట్టు కేకె శర్మ తెలిపారు. ఒక్కో కౌంటింగ్‌ కేంద్రం వద్ద రాష్ట్ర పోలీసులతో పాటు 300 మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించనున్నారు. 36 కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సాయుధులైన సీఆర్పీఎఫ్‌ దళాల పహారా కొనసాగుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/