హైపవర్‌ కమిటీ 17న మరోసారి భేటీ

AP Minister perni nani
AP Minister perni nani

అమరావతి: ఏపికి మూడు రాజధానుల అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ మూడో సారి భేటీ అయింది. విజయవాడలోని ఆర్టీసి కాన్ఫరెన్స్‌ హాలులో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. రైతులు తాము చెప్పదలచుకున్న అంశాలను రాత పూర్వకంగా కమిటీ ఇవ్వాలని కోరారు. సిఆర్‌డిఏ కమిషన్‌కు రైతులు ఆన్‌లైన్‌ ద్వారానైనా, లేదా నేరుగానైనా ఇవ్వొచ్చని ఆయన సూచించారు. ప్రజలు ప్రభుత్వానికి నేరుగా సలహాలు, సూచనలు చెప్పొచ్చునని ఆయన అన్నారు. ఈ కమిటీ సమావేశం ఈ నెల 17 న మరోసారి జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కమిటీ మొదటి సమావేశంలో జిఎన్‌ రావు, బిసిజీ నివేదికలపై చర్చించింది. రెండో సమావేశంలో రైతుల ఆందోళన, ప్రధాన డిమాండ్లు, సచివాలయ ఉద్యోగుల తరలింపు, 3 రాజధానుల ఏర్పాటు అంశాలపై కూలంఖశగా చర్చించింది. తాజాగా జరిగిన సమావేశంలో రాజధానిపై ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలపై చర్చించినట్లు తెలిసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/