సీఆర్‌డీఏ రద్దుపై హైకోర్టు నిరాకరణ

ఈ బిల్లులపై చట్ట సభలలో చర్చ జరుగుతున్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము

ap high court
ap high court

అమరావతి: పరిపాలన వికేంద్రకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం న్యాయస్థానం విచారణ జరిపింది. వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాలన్న పిటిషనర్‌ వాదననను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. సంబంధిత బిల్లులపై చట్టసభల్లో ఇంకా చర్చ కొనసాగుతున్నందున ప్రస్తుతం విచారణ అవసరం లేదని తేల్చిచెప్పింది. అలాగే ప్రభుత్వ నిర్ణయంపై మధ్యంతర ఉత్వర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ల వాదనలతో ఏకీభవించని ధ‍ర్మాసనం… మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/