బొత్స సత్యనారయణకు హైకోర్టు నోటీసులు

Botsa Satyanarayana
Botsa Satyanarayana

అమరావతి: రాజధాని విషయంలో మంత్రి బొత్స సత్యనారయణ ఇటీవల పలుసార్లు చేసిన వ్యాఖ్యలపై రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. బొత్స మాట్లడుతూ.. ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ రాష్ట్రంలో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరిస్తుందని అన్నారు. దీంతో నిపుణుల కమిటీ ఏర్పాటును సవాల్‌ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు దీనిపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు ఏకసభ్య దర్మాసనం గురువారం విచారణ చేపట్టి పలువురికి నోటీసులు అందజేశారు. వారిలో ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులు, మంత్రులు బొత్స సత్యనారయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కమిటీ కన్వీనర్‌ జీఎన్‌రావు, కమిటీ సభ్యులు ఈ నోటీసులు జారీచేసిన వారిలో ఉన్నారు. కాగా మంత్రి బొత్స ప్రకటనలతో రాజధానిపై గందరగోళం నెలకొంది ఇంకా నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రాజధానిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని చెప్పడంతో రాజధాని మార్పు ఖాయమేనా అనే ప్రశ్న రాజధాని రైతులలో ఆందోళనకు గురిచేస్తుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/