టిడిపి నేతలకు హైకోర్టు నోటీసులు

kesineni nani, bonda uma
kesineni nani, bonda uma


అమరావతి: సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి, రవాణాశాఖ కమీషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం కేసులో టిడిపి నేతలకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టిడిపి నేతలు బోండా ఉమ, బుధ్దా వెంకన్న, ఎంపి కేశినేని నాని, నాగుల్‌మీరాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయవాడ పోలీస్‌ కమీషనర్‌ ద్వారా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. 2017లో రవాణాశాఖ కమీషనర్‌పై దౌర్జన్యంకు పాల్పడిన ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కేసు తదుపరి విచారణను జూన్‌ నెలకు వాయిదా వేసింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/