ఏపీలో భారీ వర్షాలు

గోదావరి జిల్లాల్లో పొంగుతున్న వాగులు

Amaravati: అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఎపిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దీనికితోడు వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.

రెండు రోజులు అక్కడే స్థిరంగా కొనసాగి, మరింత బలపడనుందని తెలిపింది.

దీంతో రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్ర, యానాంలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో ఓ వెూస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

తీర ప్రాంతంలో గంటకు 45-55 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 3.5 విూటర్ల ఎత్తులోఎగసిపడే అలలతో సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపారు.

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరించింది.

భారీ వర్షాలకు గోదావరి  జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/