తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

heavy rains
heavy rains

హైదరాబాదు: బంగాళఖాతంలోను, అరేబియా సముద్రంలోను ఒకేసారి అల్పపీడనాలు ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణ భారతం అంతటా మేఘాలు కమ్మేశాయి. పలు ప్రాంతాలలో ఒక్కసారిగా ఈ ఉదయం నుంచి వాతావరణం మారిపోయింది. తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాభావం ఉంది. గడచిన 24 గంటల్లో తెలంగాణలోని హైదరాబాద్‌ సహా పలు జిల్లాలలో సాధారణ వర్షపాతం నమోదయింది. ఎపిలోని పలు చోట్ల కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా హైదరాబద్‌ వాతావరణ శాఖ వెల్లడించిన ఓ ప్రకటనలో అల్పపీడనాలకు తోడు ఉపరితల ఆవర్తనం తోడవడంతో దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి అధిక వర్షపాతం ఉంటుందని తెలిపింది. ఈ కారణంగా వారం రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉండొచ్చునని అధికారులు హెచ్చరించారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/