ప్రమాదకరంగా సాగుతున్న గోదారి ప్రవాహం

 బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది

Godavari river
Godavari river

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం వద్ద గోదావరికి వరద మరింత పెరిగింది. గోదారి ప్రవాహం అత్యంత ప్రమాదకరంగా సాగుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 15.6 అడుగుల నీటిమట్టం ఉంది. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. డెల్టాకాల్వలకు 10,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 15.51 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భద్రాచలం వద్ద వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో 44.8 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/