అయోధ్య తీర్పును అందరు స్వీకరించాలి

chandrababu-naidu
chandrababu-naidu

అమరావతి: దశాబ్దాల తరబడి దేశంలో అనేక సంఘటనలు, తీవ్రస్థాయి రాజకీయ పరిణామాలకు కారణమైన అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు మరికొద్ది సేపట్లో తుది తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగో§్‌ు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చేందుకు సిద్దమైంది. కాగా చాలా సున్నితమైన ఈ కేసులో తీర్పు వెల్లడి కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ‘అయోధ్య విషయమై తీర్పు వెలువడుతున్న సందర్భంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా అందరం హృదయపూర్వకంగా ఆ తీర్పును స్వీకరించాలి. సంయమనం పాటించాలి, మతసామరస్యం కాపాడాలి. శాంతి, సౌభ్రాతృత్వంతో సమసమాజ నిర్మాణామే మన అంతిమ లక్ష్యం కావాలని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
తాజా క్రీడా వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/