అందుకే అచ్చెన్నాయుడు ధీమాగా ఉన్నారు

పార్టీ అండగా నిలవకపోతే డైరీలన్నీ బయటకు తీస్తాడట!

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: టిడిపి మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై ఈఎస్‌ఐ అంశంలో వైఎస్‌ఆర్‌సిపి నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అచ్చెన్నాయుడు దోచుకున్న ప్రతి రూపాయిలో లోకేష్‌కు పంపించాడని ఆరోపించారు. అంతేకాకుండా తనకు టిడిపి పార్టీ అండగా నిలవకపోతే డైరీలన్నీ బయటకి తీస్తానని బెదిరిస్తున్నడట కదా అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. లోకేష్‌ చెబితేనే లేఖ రాశానని సన్నిహితుల వద్ద అచ్చన్న వాపోతున్నాడట. ఈఎస్‌ఐ కుంభకోణం తండ్రీ కొడుకుల కనుసన్నల్లోనే జరిగిందని, అందుకే అచ్చెన్న ధీమాగా ఉన్నాడని విజసాయిరెడ్డి అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/