చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సిపి నేత ఫైర్‌

విశాఖ నగరానికి చంద్రబాబు చేసిందేమీ లేదన్న అమర్ నాథ్

Gudivada Amarnath
Gudivada Amarnath

విశాఖ: వైఎస్‌ఆర్‌సిపి శాసనసభ్యుడు గుడివాడ అమర్ నాథ్ టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు విశాఖపట్నం నగరానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. విశాఖ ఆస్తులను ఎవరి పరం చేద్దామన్న ఆలోచనే తప్ప, నగరానికి ఆయన ఎలాంటి మేలు చేయలేదని స్పష్టం చేశారు. విశాఖ బాగుపడిందంటే అందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని, ఇప్పుడు సీఎం జగన్ పాలనలో అభివృద్ధి చెందుతోందని వివరించారు. చంద్రబాబు ఇప్పుడొచ్చి సవతి ప్రేమ నటిస్తే ప్రజలు నమ్మబోరని విమర్శించారు. ఉక్కు కర్మాగారాన్ని ఎవరికి ఇచ్చేద్దాం, బీహెచ్ పీవీని ఎప్పుడు ఎల్ అండ్ టీకి ఇచ్చేద్దాం, విశాఖ కొండలను ఎప్పుడు గీతం సంస్థలకు కట్టబెడదాం అని తహతహలాడడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని అమర్ నాథ్ వ్యాఖ్యానించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/