ఏపి ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ..గవర్నర్

biswabhusan harichandan
biswabhusan harichandan

అమరావతి : రేపు 11న శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపి గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.  భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు భోదించిన సందేశాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ గుర్తుచేస్తుందని గవర్నర్ ఒక సందేశంలో చెప్పారు. సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించడానికి శ్రీకృష్ణ జన్మాష్టమి ఒక పునాదని… సమాజంలో శాంతి, స్నేహం, సోదరభావం, ప్రజా శ్రేయస్సు నెలకొల్పేందుకు ఈ శుభదినం ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ బిశ్వభూషణ్ ఆకాంక్షించారు. 

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/