నేడు తొలి అధికారిక పర్యటన చేయనున్న ఏపి గవర్నర్‌

  • పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న హరిచందన్
Biswabhusan Harichandan
Biswabhusan Harichandan

అమరావతి: ఏపి గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన విషయ తెలిసిందే. అయితే ఆయన ఈరోజు తన తొలి అధికారిక పర్యటనను చేపట్టనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన విశాఖ బయల్దేరుతారు. ఈ మధ్యాహ్నం ఈస్టర్న్ నేవల్ హెడ్ క్వర్టర్స్ ను ఆయన సందర్శిస్తారు. సాయంత్రం కైలాసగిరి తెలుగు మ్యూజియం, వైయస్సార్ సెంట్రల్ పార్కును సందర్శిస్తారు.

రేపు ఆంధ్ర యూనివర్శిటీలో జరిగే కార్యక్రమాల్లో హరిచందన్ పాల్గొంటారు. మధ్యాహ్నం పోర్టు ట్రస్టులో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పోర్టు ట్రస్టులో జరిగి షిప్పింగ్, కార్గో కార్యకలాపాలను గవర్నర్ పరిశీలిస్తారు. అనంతరం రాత్రికి విజయవాడకు తిరుగుపయనమవుతారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/