నిర్లక్ష్యంగా ఉన్నవారిపై కేసులు నమోదు

gopala krishna dwivedi
gopala krishna dwivedi, ap ceo


అమరావతి: ఏపిలో పోలింగ్‌ రోజు చోటుచేసుకున్న ఘటనలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది కలెక్టర్లను వివరణ కోరారు. ఈవిఎంలలో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించడం కోసం నియోజకవర్గానికి ముగ్గురు నిపుణులను కేటాయించినా సేవలను వినియోగించుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందే రాష్ట్రానికి 600 మంది బెల్‌ ఇంజినీర్లు వచ్చారని, ఐనా కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంమేంటని మండిపడ్డారు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుచేసినవారిపై, నిర్లక్ష్యంగా ఉన్నవారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశామని తెలిపారు. కృష్టా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కొన్ని కేంద్రాల ఈవిఎంలను ఆర్వో ఆలస్యంగా ఇవ్వడంపైనా నివేదిక ఇవ్వాలని, అలాగే శ్రీకాకుళం జిల్లా రాజాంలో మైనర్లు ఓటు వేసిన ఘటనపై నివేదిక పంపాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/