అతి పిన్న వయస్సులో ఎంపిగా రికార్డు

goddeti madhavi
goddeti madhavi

అమరావతి: ఏపి చింతపల్లి మాజీ ఎమ్మెల్యే, సిపిఐ సీనియర్‌ నాయకులు గొడ్డేటి దేముడు కుమార్తె మాధవి(25) అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. వైఎస్‌ఆర్‌సిపి తరఫున పోటీ చేసిన మాధవి…కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌పై 2,21,058 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈమె వయసు 25 ఏళ్ల 3 నెలలు. అతి పిన్న వయస్సులో ఎంపీగా గెలుపొంది రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు 26 ఏళ్ల 13 రోజుల దుష్యంత్‌ చౌతాలాపై ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/