ఐపిఎస్‌ల బదిలీపై జగన్‌తో డిజిపి భేటి

gautam sawang, jagan
gautam sawang, jagan

అమరావతి: ఏపిలో ఐఎఎస్‌ల బదిలీలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా ఐపిఎస్‌ల బదిలీలపై ఏపి సియం జగన్‌ దృష్టి సారించారు. ఐపిఎస్‌ల బదిలీలపై చర్చించడానికి జగన్‌తో డిజిపి గౌతమ్‌ సవాంగ్‌ భేటి ఆయ్యారు. జిల్లాలోని ఎస్పీలు, కమీషనర్‌ స్థాయి వరకు బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బదిలీలకు సంబంధించిన నివేదికను తయారు చేశారని సమాచారం. ఏపి నూతన అధికార బృందంతో రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది.
నిన్న ఏకంగా 45 మంది అధికారులను బదిలీ చేసింది. సియం జగన్‌కు సన్నిహితంగా ఉంటారన్న పేరున్న అధికారులకు పోస్టులు దక్కే అవకాశముంది. ఇక కేవలం ఐఎఎస్‌, ఐపిఎస్‌ల విషయంలోనే కాకుండా దేవాలయాల పాలకమండళ్ల విషయంలో కూడా జగన్‌ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టిటిడి పాలకమండలితో పాటు ప్రధాన దేవాలయాల పాలక మండళ్లు కూడా రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/