పార్టీ మారడంపై స్పందించిన గంటా

Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao

విశాఖపట్నం: మాజీ మంత్రి, టిడిపి నాయకుడు గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారంటూ వస్తున్న వార్తల స్పందించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖలో రాజధాని పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని ప్రకటించారు. అయితే రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా విశాఖలో రాజధాని వస్తే శాంతిభద్రతలు లోపిస్తాయన్న భయాందోళనలను ప్రభుత్వం తొలగించాలన్నారు. అమరావతి రైతులకు మద్దతుగా నిలవాలన్న తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/