గంటా ఆస్తులు వేలం: ఇండియన్‌ బ్యాంక్‌

గంటా శ్రీనివాసరావు రుణాల ఎగవేత అంశం..ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు బ్యాంక్‌ ప్రకటన

ganta srinivasa rao
ganta srinivasa rao

అమరావతి: మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఆస్తుల్ని వేలం వేయనున్నట్లు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఆయనకు చెందిన ప్రత్యూష కంపెనీ, ఇండియన్ బ్యాంక్ నుంచీ రూ.142 కోట్ల అప్పు తీసుకుంది. వడ్డీతో సహా ఇప్పుడు ఆ అప్పు రూ.221 కోట్లకు చేరింది. ఈ అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఏప్రిల్ 16న ఆస్తుల్ని ఈవేలం వేయబోతున్నట్లు ఇండియన్ బ్యాంక్ తెలిపింది. ఈ వేలంలో బాలయ్యశాస్త్రి లేఅవుట్ లోని గంటా శ్రీనివాస్ ఫ్లాట్ కూడా ఉంది. అలాగే కొందరు డైరెక్టర్ల ఆస్తుల్ని కూడా వేలం వేయబోతున్నట్లు తెలిసింది. గంటాకు చెందిన ఆస్తుల్ని ఎవరైనా కొనాలనుకుంటే ఈరోజు నుంచీ 15వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/