అపశృతి: కూలిన 70 అడుగుల గణేష్ విగ్రహ మంటపం

Mandapam
Mandapam

Gajuwaka(Visakha) విశాఖ జిల్లా గాజువాక నాతయ్యపాలెంలో వినాయక చవితి పండుగ సందర్భంగా సంబరాలకు జరుగుతున్న ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. ప్రత్యేక పూజల కోసం డెబ్భై అడుగుల గణేష్ విగ్రహ ఏర్పాటుకు సిద్ధం చేస్తున్న మంటపం కూలిపోయింది. గత నెలరోజులుగా సుమారు ఇరవై మంది కూలీలు కష్టపడి సిద్ధం చేస్తున్న ఈ మంటపం అక్కడ వీస్తున్న గాలులు, భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా కూలిపోయింది.