గుంటూరు సబ్‌ జైలుకు టిడిపి ఎంపి

నాన్ బెయిలబుల్ కేసుల నమోదు

Galla-Jayadev
Galla-Jayadev

అమరావతి: టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ అమరావతి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట చేసి పోలీసులు గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఆయనపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆపై ఆయన్ను వివిధ స్టేషన్లు తిప్పుతూ అర్ధరాత్రి దాటిన తరువాత మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. తనకు బెయిల్ ఇవ్వాలని జయదేవ్ చేసిన అభ్యర్థనను తిరస్కరించిన మేజిస్ట్రేట్, 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో తెల్లవారుజాము సమయంలో గుంటూరు సబ్ జైలుకు గల్లా జయదేవ్ ను తరలించారు. ఈ ఉదయం ఆయన మరోసారి బెయిల్ పిటిషన్ ను దాఖలు చేయనున్నారు. అంతకుముందు ఓ పోలీస్ స్టేషన్ లో చిరిగిన తన చొక్కాను తొలగించిన గల్లా జయదేవ్, పోలీసుల దాడిలో తనకు తగిలిన గాయాలను మీడియాకు చూపించారు. ఎంపీనన్న గౌరవం కూడా ఇవ్వకుండా, పోలీసులు తనపై దాడి చేశారని ఆరోపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/