అవంతిపై గంటా ఆగ్రహం

g.srinivasa rao, ap minister
g.srinivasa rao, ap minister

రాజమండ్రి: వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్‌పై రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..పార్టీ మారిన తర్వాత అవంతి శ్రీనివాస్‌ చేస్తున్న విమర్శలను ప్రజలు హర్షించరన్నారు. జగన్‌ ఉగ్రవాది కంటే ప్రమాదకారి అని, రాజకీయాల నుంచి బహిష్కరించాలన్న అవంతి..ఇప్పుడెలా వెళ్లారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సిపి ఇన్‌ఛార్జ్‌లుగా జగన్‌ సామాజిక వర్గం వారే ఉన్నారని గంటా విమర్శించారు. అవంతి కోసం భీమిలి టికెట్‌ వదులుకునేందుకు కూడా సిద్ధమయ్యానని వెల్లడించారు. 1999 నుంచి తాను ఎక్కడ కోరుకుంటే అక్కడ టికెట్‌ లభించిందని వివరించారు.