త్వరలో ఏపిలో స్మార్ట్‌ విద్యుత్తు మీటర్లు!

Government of Andhra Pradesh
Government of Andhra Pradesh

న్యూఢిల్లీ: ఏపి, బిహర్‌లలో ప్రభుత్వ రంగానికి చెందిన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్‌ ( ఈఈఎస్‌ఎల్‌), ఫ్రాన్స్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ ది ప్రాన్స్‌ ఎస్‌ఏ ( ఈడీఎఫ్‌)లు కలిసి సుమారు. 50 లక్షల స్మార్ట్‌ మీటర్లను అమర్యాలని నిర్ణయించాయి. ఈ కాంట్రాక్టులో ఈడీఎఫ్‌కు 95శాతం వాటా ఉండగా.. యాక్సెంచర్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ ఇండియాకు 5 శాతం వాటా ఉంది. ఈ కన్సార్టియం మీటర్లను అమర్చడం , వాటిని విద్యుత్తు సంస్థ బిల్లింగ్‌ వ్యవస్థకు అనుసంధానించడం చేస్తుంది. తొలుత ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌లలో మొదలు పెట్టనున్నట్లు ఫ్రెంచి రాయబార కార్యాలయం వెల్లడించింది. స్మార్ట్‌ మీటర్లను అమర్చడం వల్ల బిల్లింగ్‌, మీటరింగ్‌, కలెక్షన్లలో మానవజోక్యం చాలా తగ్గిపోతుంది. ఈ పద్దతి వల్ల విద్యుత్తు దొంగతనం జరిగే ప్రదేశాలను తేలిగ్గా గుర్తించవచ్చు. దీనికి ప్రత్యేకమైన కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ , కంట్రోల్‌ సెంటర్‌ పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ అవసరం. ఇవి క్షేత్రస్థాయిలో వచ్చే విద్యుత్తు, పంపిణీ చేసిన విద్యుత్తులో వినియోగించిన మొత్తాన్ని లెక్కగడతాయి.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/