సిఎం ముఖ్య సలహాదారుగా అజయ్ కల్లం

Ajeya Kallam, Jagan
Ajeya Kallam, Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ సలహాదారుగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్  కల్లం నియమం అయ్యారు. ఈ మేరకు ఏపి ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక అజయ్ కల్లంకు కేబినెట్ హోదా కల్పించారు. 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం.. ఏపీకి స్వల్పకాలం పాటు సీఎస్‌గా పని చేశారు. 2017 మార్చి 31న పదవీ విరమణ పొందారు. గతంలో ఈయన టీటీడీ ఈవోగా, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ చైర్మన్‌గా, ఆర్థిక, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శులుగా వ్యవహరించే వారందరికీ.. అజయ్ కల్లం అధిపతిగా వ్యవహరిస్తారు. అజయ్ కల్లం ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/