ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి

విజయవాడ: : ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. భారీగా వరద నీరు వచ్చింది చేరుకుంటోంది. దీంతో 70 గేట్లు 9 అడుగుల మేర ఎత్తి ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. మరోవైపు జగ్గయ్యపేట నుంచి హంసలదీవి వరకు గల.. నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. బ్యారేజీ ప్రస్తుత నీటిమట్టం 12 అడుగులుగా ఉంది. కాగా మంగళవారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటివరకూ ఎలాంటి ఇబ్బంది లేదని ఇరిగేషన్ ఎస్సీ కేవిఎల్ఎన్పి చౌదరి చెప్పారు.
తాజా చెలి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/women/