ఏపికి ఐదుగురు డిప్యూటి సియంలు

జగన్‌ సాహసోపేతమైన నిర్ణయం

Y S jagan mohan reddy
Y S jagan mohan reddy

అమరావతి: ఏపి మంత్రివర్గంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా ఐదుగురిని డిప్యూటి సియంలుగా నియమించేందుకు ఏపి సియం వైఎస్‌ జగన్‌ సిద్దమయ్యారు. శాసనసభాపక్ష సమావేశంలో జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, కాపులకు డిప్యూటి సియంలుగా అవకాశం కల్పించాలని సియం నిర్ణయించారు. ఈ ఐదుగురిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరు దాదాపు ఖరారు కాగా, మిగిలిన నలుగురు పేర్లు ఇంకా వెల్లడించలేదు. ఇంతవరకూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు. మొత్తం 25 మంది మంత్రులతో జగన్‌ పూర్తిస్థాయి కేబినెట్‌ ఉండనుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/