గుంటూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు

జిల్లా అధికారులు అప్రమత్తం

Guntur City

Guntur: : గుంటూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. గుంటూరు సిటీలోని మంగళదాస్‌ నగర్‌కు చెందిన ఒక వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది..

ఆ వ్యక్తి ఈనెలలోనే ఢిల్లీలో జరిగిన మతపరమైన సమావేశంలో పాల్గొని ఇక్కడకు వచ్చాడు. ఈనెల 18న గుంటూరు సిటీకి చేరుకున్నాడు.

కాగా జలుబు, జ్వరం లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఆ వ్యక్తికి వైద్యపరీక్షలు నిర్వహించటంతో కరోనా నిర్ధారణ అయ్యింది..దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/