ఎపిలో తొలి క‌రోనా మ‌ర‌ణం

విజయవాడ భవానీపురంలో

First corona death in AP

Vijayawada: ఎపిలో తొలి క‌రోనా మ‌ర‌ణం న‌మోదైంది..విజయవాడలో భవానీపురంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్ రావడం కలకలం రేపగా తొలి కరోనా మరణం కూడా అక్కడే సంభవించింది.

గత నెల 30 వ తేది ఉదయం 11.30కి  విజయవాడకు  చెందిన షేక్ సుభానీ  విజయవాడకు చెందిన షేక్ సుభానీ చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ హాస్పటల్ లో చేరాడు.. చేరిన గంటకే ఆయన చనిపోయారు.

అతడికి హైపర్ టెన్షన్, డయాబెటిక్, కార్డియాక్ సమస్యలున్నాయి..

అతడి కుమారుడికి కరోనా పాజిటీవ్ రావడంతో అనుమానంతో షేక్ సుభానీ మరణించిన తర్వాత మరణ నిర్ధారణ కోసం కరోనా పరీక్షలు కోసం శాంపిల్స్ ను పుణేకు పంపారు.

అందులో అతడు కరోనాతోనే మరణించినట్లు తేలింది. దీంతో అధికారికంగా కరోనాతో మరణించినట్లు అధికారులు ఈరోజు ప్రకటించారు. 

కాగా ఎపిలో క‌రోనా కేసులు సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా పన్నెండు కరోనా కేసులు న‌మోదయ్యాయి.

దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 161 కి చేరుకుంది. నెల్లూరులో అత్యధికంగా 8 కేసులు నేడు నమోదయ్యాయి. వీరు అందరూ కూడా ఢిల్లీ వెళ్లి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు.

జిల్లాల వారీగా క‌రోనా కేసుల వివ‌రాలు

అనంతపురం -2, చిత్తూరు -9, తూర్పుగోదావరి -9, గుంటూరు -20, కడప -19, కృష్ణా -23, కర్నూలు -1, నెల్లూరు -32, ప్రకాశం- 17, విశాఖపట్నం -14, పశ్చిమ గోదావరి-15 .

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/