భారీ అగ్నిప్రమాదం..50 షాపులు అగ్నికి అహుతి

fire accident
fire accident

విజయనగరం: ఈరోజు తెల్లవారుజామున విజయనగరం పట్టణంలో ఉన్న చిన్న మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 50 షాపులు అగ్నికి అహుతయ్యాయి. అయితే ఈ మార్కెట్‌లో అంతా చిన్న వ్యాపారులే కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. కాగా ఈ ప్రమాదం గురించి అగ్నిమాపం సిబ్బందికి అలస్యంగా సమాచారం అందడంతో వారు చేరుకునే లోపే మార్కెట్‌లోని దుకాణాలు, సరకులు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక అధికారులు అక్కడ జరిగిన ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/