ట్రావెల్‌ బస్సులో మంటలు

fire accident
fire accident

ప్యాపిలి: కర్నూలు జిల్లా ప్యాపిలి మండల పరిధిలో జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారు జామున ప్రయణికులతో వెళుతున్న ఎల్లో ట్రావెల్‌ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ బస్సు 20 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌ నుండి బెంగుళూరు వెళ్తోంది. బస్సు వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు ప్లాస్టిక్‌ వస్తువులు కాలిన వాసన రావడంతో అనుమానం వచ్చి డ్రైవర్‌కు చెప్పారు. అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన ఆపడంతో ప్రయాణికులంతా కిందకు దిగారు. క్షణాల్లోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించి, బస్సుతో పాటు అందులో ఉన్న సామగ్రి మొత్తం కాలిబూడిదయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ హాని జరగలేదు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/