ఆటోలో సిలిండర్‌ పేలి ఒకరి మృతి

fire accident
fire accident


కర్నూలు: ఆటోలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఏపిలోని కర్నూలులో చోటుచేసుకుంది. ఆటోలో ఆక్సిజన్‌ గ్యాస్‌ సిలిండర్లు తరలిస్తున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లు పేలాయా? లేక ఆటోలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి సిలిండర్‌ పేలిందా అనేది తెలియాల్సిఉంది. ఎండ వేడిమే సిలిండర్‌ పేలుడుకు గల కారణంగా సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/