పరిశ్రమలో అగ్నిప్రమాదం..భారీ ఆస్తి నష్టం

fire accident
fire accident

అంబాజీపేట: తూర్పుగోదావరి జిల్లా అంబాజీ పేటలోని కొబ్బరిపీచు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలో మంటలు చెలరేగడంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బందికి ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కొబ్బరిపీచు భారీగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దాదాపు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లిందని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/