ప్రజావేదిక వద్ద అగ్నిప్రమాదం

fire accident
fire accident

అమరావతి: ప్రజావేదిక వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఐరన్‌ రాడ్స్‌ కట్‌ చేస్తుండగా మంటలు చెలరేగాయి. అవి కాస్తా వ్యాపించడంతో పక్కన ఉన్న ఫైబర్‌ రేకులకు ఒక్కసారిగా అంటుకున్నాయి. మంటలు భారీగా ఎగసి పడుతుండడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి పక్కనే చంద్రబాబు నివాసం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమైంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/