ఆర్థిక పరిస్థితి బాగా లేదు.. ఆదుకోండి

ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ వినతి

ys. jagan
ys. jagan

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు కరోనా పరిస్థితిపై పలు రాష్ట్రాల సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా ఏపి సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించేందకు తీసుకుంటున్న చర్యల గురించి మోదీకి వివరించారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 132 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కాగా ఇందులో 111 మంది జమాత్‌కు వెళ్లినవారు, వారి కుటుంబీకులు, వారితో కాంటాక్టులో ఉన్నవారేనని అన్నారు.

ప్రస్తుతం భాధితులను క్వారంటైన్‌ కేంద్రాలకు, ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించి, వారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు.

కాగా ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిందని, రాష్ట్రాన్ని తగిన విధంగా ఆదుకోవాలని, వైద్య పరికరాలను కూడా తగిన సంఖ్యలో అందించాలని విజ్ఞప్తి చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/