బుగ్గనకు ఆర్ధిక శాఖ ఫిక్స్‌ చేసిన జగన్‌!

Buggana Rajendranath Reddy
Buggana Rajendranath Reddy


అమరావతి: కర్నూలు జిల్లా డోన్‌ ఎమ్మెల్యే బుగ్గాన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆఖరి నిమిషం వరకు కార్యకర్తల్లో ఆందోళనగానే ఉంది. ఐతే విజయసాయిరెడ్డి దగ్గర నుంచి బుగ్గానకు ఫోన్‌ కాల్‌ రావడంతోనే డోన్‌ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు ఆనందంలో మునిగితేలారు. ఇప్పుడు ఆయనకు ఏశాఖ కేటాయిస్తారోనని ఉత్కంఠగా ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటి నుంచి లీకుల ప్రకారం బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి అనుకున్న దక్కినట్టేనని సమాచారం. ఆర్దికశాఖ ఐతే బాగుంటుందని అనుకుంటున్నారు. అందరూ అనుకున్నట్లుగా ఆయనకు ఆర్ధికశాఖ ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ ఫిక్స్‌ చేశారని తెలుస్తుంది. ఈ విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/