ప్రాణాలైనా ఇస్తాం.. రాజధానిని సాధిస్తాం

రాజధాని రైతులు నల్లజెండాలతో నిరసన

amaravati farmers
amaravati farmers

అమరావతి: ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. తూళ్లూరు, మందడంలో రైతులు పెద్ద ఎత్తున దీక్షలో కూర్చున్నారు. ఏపి సిఎం జగన్‌ రాజీనామా చేయాలంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రాజధానిపై ఏర్పాటు చేసిన వికేంద్రీకరణ బిల్లు ఆగాలని మొక్కని దేవుడు లేడు, చేయని పూజలు లేవు అంటున్నారు. తమ పూజలు ఫలించాలి, ఈ ఒక్కరోజు మండలిలో బిల్లు ఆగాలని రైతులు కోరుకున్నారు. ఈ ఒక్కరోజు గనుక బిల్లు ఆగితే ఆ తర్వాత న్యాయపరంగా పోరాడుతామని రైతులు వెల్లడించారు. రైతుల అభీష్టం లేకుండా మూడు రాజధానులకు అనుకూలంగా కేబినేట్‌ ఎలా తీర్మానం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ రాజధానిని మాత్రం సాధిస్తామని స్పష్టం చేశారు. వెలగపూడిలో రైతులు దీక్షా శిబిరంలో నల్ల జెండాలతో నిరసనలు తెలుపుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/