వివేకాను కడసారి చూసేందుకు అభిమానులు

vivekanandareddy dead body
vivekanandareddy dead body


కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి అంతిమయాత్ర కాసేపట్లో ప్రారంభంకానుంది. ప్రస్తుతం వివేకా భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యులు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కాగా..పులివెందులలోని వైఎస్‌ రాజారెడ్డి ఘాట్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. వివేకాను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పులివెందులకు తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా వివేకా హత్య నేపథ్యంలో పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పారీ మిలటరీ బలగాల బందోబస్తు ఏర్పాటు చేశారు.

prayers
prayers