కాంగ్రెస్‌లోకి కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌

sai prathap
sai prathap

కడప: కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌ గురువారం నాడు రఘువీరారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన సాయిప్రతాప్‌ వైఎస్‌కు అత్యంత సన్నిహితులు. వైఎస్‌ మరణానంతరం కొన్నాళ్లు సాయిప్రతాప్‌ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2016లో ఆయన టిడిపిలో చేరారు. మార్చి 31న ఆయన టిడిపిని వీడారు. తన బంధువుకు టికెట్‌ ఇప్పించాలని ప్రయత్నించిన సాయిప్రతాప్‌ ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన టిడిపిని వీడినట్లు ప్రచారం జరిగింది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/