ఏపిలో మే 6న ఐదు చోట్ల రీపోలింగ్‌

Election Commission
Election Commission

అమరావతి: ఏపిలో ఏప్రిల్‌ 11వ తేదీన 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అక్కడ పోలింగ్ కేంద్రాల్లో తలెత్తిన ఇబ్బందుల కారణంగా రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఏపిలో ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని కేసరపల్లి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పల్లెపాలంలోని ఇసుకపల్లి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అటకాని తిప్ప, ప్రకాశం జిల్లా యర్రగొండలపాలెం నియోజకవర్గంలోని కలనూతలలో ఈ నెల 6వ తేదీన రీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/