తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూకంపం

భయంతో ఇళ్లల్లోంచి పరుగులు తీసిన ప్రజలు

Richter scale graph
Richter scale graph

హైదరాబాద్‌ ఏపి, తెలంగాణలో అర్థరాత్రి 2.30 గంటలకు భూకంపం వచ్చింది. 8 సెకండ్లపాటూ భూమి కంపించింది. కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో… భూ ప్రకంపనలు వచ్చాయి. గుండ్రాయి, చిల్లకల్లు, జగ్గయ్య పేట బెల్లంకొండ, పిడుగురాళ్ల, మాచవరంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.7గా నమోదైంది. ప్రజలు ఇళ్లలోంచీ బయటకు పరుగులు తీశారు. రాత్రంతా నిద్రలేకుండా గడిపారు. కొంత మంది తమ ఇళ్లలో వస్తువులు కూడా అటూ ఇటూ కదిలాయని అంటున్నారు. ఐతే… ఈ ప్రకంపనల వల్ల భయపడాల్సిన అవసరం లేదనీ, ఇవి చిన్న ప్రకంపనలేననీ అధికారులు అంటున్నారు. ఏది ఏమైనా… ఇటీవల ఎప్పుడూ లేనిది ఇలా భూకంపం రావడంతో… ఆయా జిల్లాల్లో ప్రజల్లో అలజడి రేగింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/