ఏపి నిరుద్యోగ ఉపాధ్యాయులకు శుభవార్త

AP Govt LOGO
AP Govt LOGO

అమరావతి: ఏపి ప్రభుత్వం నిరుద్యోగ ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పింది . రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వచ్చేనెలలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ విషయం వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరిలో 7,900 ఖాళీలతో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎప్పటి నుంచో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇది ఎంతో సంతోషకరమైన వార్త.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/