ద్రోణంరాజు శ్రీనివాస్‌కు కీలక పదవి

విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా నియామకం

Dronam raju srinivas
Dronam raju srinivas, YSRCP leader

అమరావతి: ఏపి సియం వైఎస్‌ జగన్‌ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్‌ఆర్‌సిపి సీనియర్‌ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌ను విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా నియమించారు. విశాఖకు చెందిన శ్రీనివాస్‌ తొలుత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో విశాఖ తరఫున విశాఖ సౌత్‌ నుంచి పోటీ చేసి ద్రోణంరాజు టిడిపి అభ్యర్థి గణేశ్‌ కుమార్‌ చేతిలో ఓడిపోయారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/