రివర్స్‌ టెండరింగ్‌ వద్దు

botsa satyanarayana
botsa satyanarayana

గుంటూర్‌: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. గత చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ప్రాజెక్టుల విషయంలో అవకతవకలు జరిగాయని రివర్స్‌టెండరింగ్‌ విదానాన్ని ప్రవేశపెట్టాడు. కాని ప్రతి పనికి రివర్స్‌ టెండరింగ్‌ సాధ్యంకాదని మంత్రి బొత్స సత్యనారయణ స్పష్టం చేశారు. నేడు ఆయన సహచర మంత్రి అయిన మోపిదేవితో కలిసి గుంటూరు కార్పోరేషన్‌లో పర్యటించారు. భూగర్బ డ్రైనేజీకి రూ.391 కోట్లు ఖర్చు చేసినా ఆ మేరకు పనులు జరగలేదని బొత్స అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వరకు మొత్తం పనులు పూర్తికావల్సి ఉండగా ఇప్పటికి 50 శాతం పనులు జరిగాయన్నారు. కాంట్రాక్టులను మార్చే ఉద్దేశ్యం మాకు లేదన్నారు. కాని అనుకున్న సమాయనికి కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయాలని అన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల సమయం వృదా అవుతుందని దానివల్ల ప్రాజెక్టులను పూర్తిచేయలేమని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం టిడిపి పార్టీ సానుభూతి పరులకు టెండర్లు ఎక్కువ అంచానావేసి ఆ పార్టీచెందిన నేతలకు కట్టబెట్టిందని బొత్స అన్నారు.
తాజా తెలంగాణ వార్తలకోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/