వైద్యుడి కుటుంబం ఆత్మహత్య

Doctor-Family
Doctor-Family

అమలాపురం:తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో దారుణం సంభవించింది. తన కుటుంబంతో కలసి ఓ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, డాక్టర్ కృష్ణంరాజుకి ఆర్థోపెడిక్ వైద్యుడిగా మంచి పేరు ఉంది. రియలెస్టేట్ వ్యాపారంలో ఆయన పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, వ్యాపారంలో నష్టాలు రావడంతో భార్య, కుమారుడితో కలసి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సెలైన్ ద్వారా విషం ఎక్కించుకుని వీరు బలమన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/