మోర్తాటలో పేదలకు ‘జనసేన’ కూరగాయల పంపిణీ

పార్టీలకు అతీతంగా అందరికీ సాయం అందించాలని ప్రభుత్వానికి వినతి

distribution of vegitables by jana sena leaders-
distribution of vegitables by jana sena leaders-

రేపల్లె (గుంటూరుజిల్లా- ఆంధ్రప్రదేశ్‌): రేపల్లె మండలం మోర్తాట గ్రామంలో గురువారం జనసేనపార్టీ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.

పార్టీ నాయకుడు కమతం సాంబశివరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. అనంతరం ఆయన మాట్లాడారు.

కరోనా క్రైసిస్‌ తరుణంలో రేషన్‌ అందించే విషయంలోనూ, రూ.వెయ్యి ఆర్థికసాయం పంపిణీలోనూ,ఇతర ప్రజా పంపిణీలో పక్షపాతం లేకుండా పార్టీలకు అతీతంగా పేదలందరికీ పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

కరోనా మహమ్మారి నియంత్రణంలో భాగంగా కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు జారీచేసిన ఆదేశాలను పాటించాలని అన్నారు.

ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వచ్చేనెల 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ ఆరోగ్య పరంగా జాగ్రత్త వహించాలని కోరారు.

పార్టీ నాయకులు కమతం బ్రహ్మారావు, తోట శ్రీనివాసరావు, కమతం పోతురాజు, కారాని శివ, కారాని ప్రదీప్‌, గాజులవర్తి సన్నిబాబు, డొక్కువీరయ్య, ఆండ్రాజు నరసింహా,దాసరి బాలాజీ పాల్గొన్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/