అమరేశ్వరుని రథోత్సవంలో ‘రాజధాని’ సెగ

రథోత్సవంలో నిరసన తెలుపుతున్న రాజధాని రైతులు

అమరావతి (గుంటూరుజిల్లా): పంచారామాల్లో ప్రథమ పవిత్రపుణ్యక్షేత్రంలో కొలువైవున్న శ్రీబాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వరస్వామివార్ల దివ్యరథోత్సవంలో వందలాది మంది రాజధాని రైతులు ఆదివారం పాల్గొన్నారు. వీరంతా జేఏసి జెండాలతో రాజధానిని అమరావతిలోనే వుంచాలని, జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ రధోత్సవంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున రాజధాని రైతులు రధోత్సవంలో జెండాలతో రావడంతో కొంతసేపు భక్తులలో భయాందోళన చోటుచేసుకుంది. ఆలాగే ఒకవైపు వైకాపా మంత్రి మోపిదేవి వెకరటరమణ,ఎం.పి. నందిగం సురేష్‌, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, మద్ధాలి గిరి, నంబూరు శంకరరావు, చంద్రగిరి ఏసురత్నం, షేక్‌ ముస్తఫా రధోత్సవానికి రావడంతో రాజధాని రైతులు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో వారు అక్కడ నుండి వెళ్ళిపోయారు.

కారు తగిలి కిందపడిన రాజధాని రైతు హనుమంతురావు

ఈ క్రమంలో తుళ్ళూరుకు చెందిన తాడికొండ హనుమంతురావు అనే రైతుకు ఎం.పి. నందిగం సురేష్‌ కారు తగలడంతో అతని కాలికి పాక్చర్‌ అవ్వడంతో అమరావతి ప్రభుత్వ అసుపత్రికి తరలించి అక్కడ డాక్టరు స్వప్న ప్రాధమిక చికిత్స చేసి మెరుగైన వైద్యంకోసం గుంటూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలియక కొంతమంది వైకాపా కార్యకర్తలు రాజధాని రైతులు ఎం.పి. నందిగం సురేష్‌ కారుపై దాడి చేశారనే సమాచారంతో లేమల్లే సెంటరులో రాజధాని రైతుల బస్సును అడ్డగించే ప్రయత్నం చేశారు. ఏదైనప్పటికి అమరేశ్వరస్వామివారి రధోత్సవంలో వైకాపా మంత్రి, ఎం.పి., ఎమ్మెల్యేలు రావడం అదే సమయంలో రాజధాని రైతులు రావడం కొంత ఉద్రిక్తతకు దారితీసింది. ఎటువంటి గొడవలు జరగకకుండా రథోత్సవం ముగియటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/