తిరుమలలో భక్తుల రద్దీ

devotees rush
devotees rush

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 76,677 మంది భక్తులు దర్శించుకోగా, 41,269 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.