తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ

tirumala temple
tirumala temple

తిరుమల: తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. వైకుంఠం వెలుపల సైతం క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. వేంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనానికి 16 గంటల సమయం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 83,840 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.34కోట్లుగా ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/