జగన్‌ మానసిక పరిస్థితి ప్రమాదకరం

jagan, devineni uma
jagan, devineni uma


అమరావతి: జగన్‌ మానసిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఎన్నికల ఫలితాలు చూసి జగన్‌ తట్టుకోలేడని, 11వ తేది సాయంత్రమే జగన్‌ తన ఓటమిని అంగీకరించారని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఉమ మీడియాతో మాట్లాడారు. జగన్‌కు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, కౌంటింగ్‌ వరకు క్యాడర్‌ను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆయన అన్నారు. ఫైనల్‌ పేమెంట్‌ తీసుకుని ప్రశాంత్‌ కిషోర్‌ జగన్‌ చేతిలో సియం అనే నేమ్‌ ప్లేట్‌ పెట్టి వెళ్లాడని విమర్శించారు. స్పీకర్‌పై దాడి చేసి మళ్లీ వారే గవర్నర్‌కు అన్నీ అబద్ధాలే చెప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చొక్కాలు చించుకునే సంస్కృతి జగన్‌దే నని అన్నారు. మళ్లీ ఏపిని పాలించేది తెలుగుదేశమేననే ధీమా వ్యక్తం చేశారు. చంచల్‌ గూడ జైలుకా? లేదా చర్లపల్లి జైలుకా ?అనేది జగనే తేల్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితుల్లో వైఎస్‌ఆర్‌సిపి జోస్యం చెప్పారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/